VZM: మెడికల్ కళాశాలల PPP విధానానికి వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చివరి దశకు చేరుకుందని YCP జిల్లా అధ్యక్షుడు, ZP ఛైర్మన్ శ్రీనివాసరావు ఇవాళ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున అన్ని వర్గాల నుంచి నిరసన వ్యక్తం అవుతోందన్నారు. విద్య, వైద్యం ఉచితంగా అందించాలనే నిబంధనను ప్రబుత్వం విస్మరించిందన్నారు.