వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలంలోని నాగర్లబండ తండాలో ఇవాళ ఎక్సైజ్, టాస్క్ ఫోర్స్ పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో నాగర్లబండ తండాకు చెందిన బానోతు కిషన్ బైక్ పై అక్రమంగా తరలిస్తున్న 14 లీటర్ల నాటు సారాయి పట్టుపడింది. పట్టుకున్న ముడి సరుకును స్వాధీన పరుచుకొని, వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ అధికారి శ్రీనివాసులు తెలిపారు.