SKLM: భామిని మండలం PTM మీటింగ్ 3.0 పర్యటనలో భాగంగా నేడు హెలిప్యాడ్‌కు చేరుకున్న సీఎం చంద్రబాబుకు పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు మర్యాదపూర్వక స్వాగతం పలికారు. ఈ మేరకు ఇరువురు ప్రాంతీయ ప్రజా సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. పాతపట్నం నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు.