MBNR: మిడ్జిల్ మండలం లింభ్యా తండా గ్రామ పంచాయతీలో 8 వార్డుల సభ్యులు ఏకగ్రీవం కాగా, అశ్విని, సాలి, మన్ని, సర్పంచ్ స్థానానికి పోటీ పడనున్నారు. ఎన్నికైన వార్డు సభ్యులు మాట్లాడుతూ.. తమను ఏకగ్రీవంగా ఎంపిక చేసిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి, వార్డు అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తామని హామీ ఇచ్చారు.