తాజా పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం రాష్ట్రంలో 15-49 ఏళ్ల వారిలో నిరుద్యోగిత రేటు 16.6శాతం ఉన్నట్లు కేంద్ర కార్మిక శాఖ సహాయమంత్రి శోభా కరంద్లాజే తెలిపారు. రాజ్యసభలో బీఆర్ఎస్ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో 2017-18లో 23.3శాతం ఉన్న రేటుతో పోలిస్తే.. ప్రస్తుతం తగ్గిందని వెల్లడించారు.