SRPT: స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఎఫ్ఎస్ఈ ఆధ్వర్యంలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం నేరేడుచర్ల మండలంలోని నల్గొండ, సూర్యాపేట జిల్లా సరిహద్దు ప్రాంతమైన చిల్లేపల్లి చెక్ పోస్ట్ వద్ద కోదాడ నుంచి జడ్చర్ల వెళ్లే జాతీయ రహదారిపై వెళ్లే వాహనాలను ఆపి తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో ఏఎస్ఐ సురేందర్, కానిస్టేబుల్ వెంకన్న లింగయ్య ఉన్నారు.