NDL: దేవదాయ శాఖ పరిధిలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు శుక్రవారం కలెక్టర్ రాజకుమారి తెలిపారు. జిల్లాలోని అన్ని దేవాలయాల్లో వసతి సౌకర్యాలపై ఎప్పటికప్పుడు ఈవోలతో మాట్లాడుతున్నట్లు చెప్పారు. మైనార్టీ శాఖలో వన్ లాక్ స్కీం అమలు కోసం మార్గదర్శకాలు వచ్చిన వెంటనే కార్యక్రమాలు ప్రారంభిస్తామన్నారు.