SRD: సిర్గాపూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని సబ్ కలెక్టర్ ఉమా హారతి ఇస్ ఇవాళ ఆకస్మికంగా సందర్శించారు. ఈ మేరకు స్థానిక ఎంపీడీవో శారదా దేవితో కలిసి నామినేషన్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన కౌంటర్లను ఆమె పరిశీలించారు. చివరి రోజు నామినేషన్ల ప్రక్రియ పకడ్బందీగా కొనసాగించాలని ఆమె ఆదేశించారు.