ADB: ఇంద్రవెల్లిలో ఆదివాసీ పోరాటయోధుడు కొమురంభీం పేరుతో యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం హర్షణీయమని రాజ్ గోండ్ సేవ సమితి విద్యార్ధి సంఘం జిల్లాధ్యక్షుడు కుమ్ర చతుర్శా అన్నారు. ఈ నిర్ణయం ఉన్నత చదువుల కోసం దూరమవుతున్న విద్యార్థుల భవిష్యత్తు కోసం సహాయపడుతుందని పేర్కొన్నారు. దీన్ని త్వరగా మంజూరు చేయాలని ఆయన కోరారు.