KRNL: తుగ్గలి మండలం జొన్నగిరి ఎస్సీ కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రధానోపాధ్యాయుడు హరి నారాయణ, విద్యా కమిటీ ఛైర్మన్ ఆంజనేయులు ప్రారంభించారు. విద్యార్థుల తొలి గురువు తల్లిదండ్రులేనని, వారి అభ్యున్నతికి ఇంటి నుంచే ప్రత్యేక శ్రద్ధ అవసరమని ఉపాధ్యాయులు అన్నారు.