E.G: కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్స్ రద్దు చేయకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని సీఐటీయూ జిల్లా కార్యదర్శి పీవీ ప్రతాప్ హెచ్చరించారు. శుక్రవారం సీఐటీయూ ఆధ్వర్యంలో తణుకులో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కార్మికులు, ఉద్యోగులకు భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు లేబర్ కోడ్స్ ద్వారా దూరం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.