KKD: జగ్గంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థుల చదువు, ప్రగతి వివరాలను తల్లిదండ్రులు తెలుసుకునేందుకు వీలుగా ప్రభుత్వం అన్ని పాఠశాలల్లో ఈ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ పాల్గొన్నారు.