మహబూబ్నగర్ రూరల్ మన్యంకొండ క్షేత్రంలో గురువారం శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పల్లకిని పునరుద్ధరించుకొని శోభాయమానంగా అలంకరించిన పల్లకిలో స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను గర్భగుడి నుంచి దేవస్థానం సమీపంలోని మండపం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం పురోహితులు వేదమంత్రాలు, సన్నాయి వాయిద్యాల నడుమ స్వామి వారి కళ్యాణం జరిపారు.
Tags :