MDK: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎఫ్ఎస్ఈ బృందం ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తోంది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పోలీస్, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు మద్యం, డబ్బు లేదా వస్తువుల అక్రమ రవాణా జరగకుండా నిఘా ఉంచినట్లు తెలిపారు. రూ.50 వేలకు మించి డబ్బు తరలిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.