ఉమ్మడి WGL జిల్లాలో GP ఎన్నికల్లో ప్రధాన పార్టీ నేతలు ఆసక్తి చూపకపోవడం చర్చనీయాంశంగా మారింది. గతంలో నిధుల సమీకరణ, నైతిక మద్దతులో చురుకుగా ఉన్న నేతలు ఇప్పుడు ప్రచారానికి దూరంగా ఉన్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల భయంతో నేతల్లో ఆందోళన నెలకొంది. ఈ పరిస్థితి పార్టీ శ్రేణుల్లో నిరుత్సాహాన్ని రేకెత్తిస్తోంది.