WGL: చలికాలంలో పొగమంచు కారణంగా రహదారి స్పష్టత తగ్గి ప్రమాదాలు పెరుగుతున్నాయని వర్ధన్నపేట ఎస్సై సాయిబాబు హెచ్చరించారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. అతి వేగం వద్దని, లో బీమ్, ఫాగ్ లైట్లు వాడాలని, ముందు వాహనంతో దూరం పాటించాలని సూచించారు. సడన్ బ్రేకులు వేయవద్దని, పొగమంచు ఎక్కువగా ఉంటే వాహనం ఆపి స్పష్టత వచ్చాకే ప్రయాణం కొనసాగించాలని ఆదేశించారు.