TG: తన కుమారుడిపై వచ్చిన ఆరోపణలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. తప్పు చేస్తే తానైనా.. తన కుమారుడైనా శిక్షకు అర్హులే అని పేర్కొన్నారు. ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, ప్రభుత్వం ఎంత పారదర్శకంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. త్వరలో అన్ని విషయాలు బయటపడుతాయని వెల్లడించారు.