MDK: రామాయంపేట మండల కేంద్రంలోని అభయాంజనేయ స్వామి దేవాలయంలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ద్వితీయ వార్షికోత్సవం పురస్కరించుకొని శుక్రవారం నుంచి ఆదివారం వరకు మూడు రోజులపాటు వార్షికోత్సవ వేడుకలు నిర్వహిస్తామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. మొదటిరోజు పుణ్యాహవచనం, అఖండ దీపారాధన, 2వ రోజు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు.