CTR: గుడిపాల మండలంలో ఎంపీపీ ప్రసాద్ రెడ్డికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. మండలంలోని 12 మంది ఎంపీటీసీలలో 8 మంది ఆయనపై అవిశ్వాస తీర్మానం పెట్టగా, చిత్తూరు ఆర్డీవో శ్రీనివాసులు, డీఎస్పీ సాయినాథ్, ఎంపీడీవో శిరీష సమక్షంలో నిర్వహించిన సమావేశంలో తీర్మానం ఆమోదమైంది. దీంతో వైసీపీ తరఫున ఎన్నికైన ప్రసాద్ రెడ్డి ఎంపీపీ పదవిని కోల్పోయారు.