NTR: జిల్లాలో సుమారుగా 50వేల ఎకరాల్లో సుబాబుల పంట సాగుతుందని రైతు సంఘం జిల్లా కార్యదర్శి పివి ఆంజనేయులు పేర్కొన్నారు. సుబాబుల ధర రూ. 6500వేలు తగ్గకుండా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. వ్యాపారస్తులు కుమ్మక్కై రూ. 5800వేలకు ధర తగ్గించి రైతులకు నష్టం చేకూర్చుతున్నారని అన్నారు. దీనివల్ల ప్రభుత్వానికి కూడా నష్టం వాటిల్లుతుందని ఆర్డీవోకి వినతిపత్రం అందజేశారు.