NTR: వైద్య కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైసీపీ ఆధ్వర్యంలో తిరువూరు బైపాస్ రోడ్ వద్ద సంతకాల సేకరణ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ స్వామిదాస్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంతకాలు చేసి ప్రభుత్వ నిర్ణయంపై తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు.