NZB: బాల్కొండ మండలం పరిధిలో మూడవ విడత ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ రెండో రోజు ముగిసింది. మండలానికి కేటాయించిన 10 గ్రామ పంచాయతీలకు 29 మంది సర్పంచ్ అభ్యర్థులు, 108 మంది వార్డు సభ్యులు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఇప్పటివరకు నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగుతోందని రిటర్నింగ్ అధికారి విజయ భాస్కర్ రెడ్డి వెల్లడించారు.