MNCL: జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం వద్ద శుక్రవారం జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ బాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకై ఈశ్వర చారి ఆత్మహత్యకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.