దేవస్థానం సంపదపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. దేవస్థానం సంపద దేవుడికి సంబంధించినదే అని, దేవస్థానం డబ్బు సహకార బ్యాంకుల మనుగడకు ఉపయోగించరాదని వెల్లడించింది. దేవస్థానం డిపాజిట్లను తిరిగి ఇవ్వాలని కేరళ హైకోర్టు ఆదేశాలపై కేరళ సహకార బ్యాంకులు సుప్రీంకోర్టులో సవాల్ చేశాయి. దీంతో సీజేఐ జస్టిస్ సూర్యకాంత నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.