రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో చైనా కీలక వ్యాఖ్యలు చేసింది. ఏ దేశం ఒంటరి కాదనే సందేశాన్ని పుతిన్ ప్రపంచానికి తెలియజేశారంటూ చైనా వ్యాఖ్యానించింది. ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో రష్యాపై అమెరికా, పశ్చిమ దేశాలు అనేక ఆంక్షలు విధించాయి. తాజా వ్యాఖ్యలతో చైనా పరోక్షంగా ఆ దేశాలన్నింటికీ కౌంటర్ ఇచ్చింది.