భారత పర్యటనలో ఉన్న రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. హైదరాబాద్ హౌస్లో ఇరు దేశాధినేతలు 23వ ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. పలు అంశాలపై వీరు చర్చలు జరిపారు. అనంతరం ప్రధాని మోదీ, పుతిన్ సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు.