MNCL: గ్రామపంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు మందమర్రి సర్కిల్ పోలీసులు చర్యలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఇవాళ సీఐ శశిధర్ రెడ్డి నేతృత్వంలో సర్కిల్ పరిధిలోని రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఎన్నికల సమయంలో తప్పనిసరిగా పాటించాల్సిన విధివిధానాలు గురించి సీఐ వారికి వివరించారు.