GNTR: తెనాలిలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న మంత్రి నాదెండ్ల మనోహర్, కలెక్టర్ తమీమ్ అన్సారియా, డీఈవో రేణుక, సబ్ కలెక్టర్ సంజనా సింహ తదితరులు విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. అంగలకుదురు జడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన సభా కార్యక్రమం అనంతరం వారు నేల మీద కూర్చుని మధ్యాహ్న భోజనం చేసి, సంతృప్తి వ్యక్తం చేశారు.