BHNG: రామన్నపేట మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి మిర్యాల మల్లేష్ శుక్రవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య బీఆర్ఎస్ పార్టీ నుంచి అధికారికంగా మల్లేష్‌కు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా పట్టణ పార్టీ ముఖ్యులకు ఆయన పలు సూచనలు చేశారు. మల్లేష్‌ను అధిక మెజారిటీతో గెలిపించే బాధ్యతను ప్రతీ కార్యకర్త తీసుకోవాలన్నారు.