ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ సంయుక్త మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ‘భారత్కు రష్యా సుదీర్ఘకాలంగా మిత్రదేశంగా ఉంది. మన రెండు దేశాల మధ్య స్నేహం ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది. ఇరుదేశాల మధ్య చారిత్రక సంబంధాలు ఉన్నాయి. మన ద్వైపాక్షిక సంబంధాలు ఒక మైలురాయిగా నిలుస్తాయి’ అని పేర్కొన్నారు.