భారత్, రష్యా స్నేహ సంబంధాలకు చారిత్రక నేపథ్యం ఉందని రష్యా అధ్యక్షుడు పుతిన్ వెల్లడించారు. మోదీతో నిర్మాణాత్మక చర్చలు జరిగినట్లు తెలిపారు. ‘భారత్తో కీలక ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఒప్పందంలో వాణిజ్యం, సాంకేతికత కీలక ప్రాధాన్యాలు. ప్రపంచ సమస్యలపై అభిప్రాయాలు పంచుకున్నాం. భారత్, రష్యా మధ్య రవాణా అనుసంధానం పెంచడం మా లక్ష్యం’ అని పేర్కొన్నారు.