MDK: మూడో విడత చివరి రోజు స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ ప్రక్రియను దృష్టిలో ఉంచుకుని పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్టు జిల్లా ఎస్పీ డివి. శ్రీనివాస్ రావు తెలిపారు. కొల్చారం ఎంపీడీవో కార్యాలయంలో నామినేషన్ ప్రక్రియ పరిశీలించారు. నామినేషన్ ప్రక్రియ జరుగుతున్న గ్రామ పంచాయతీలు, వార్డుల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టామన్నారు.