KMR: మొహమ్మద్ నగర్ మండలంలోని అసంపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల శిథిలావస్థకు చేరుకుంది. ప్రభుత్వం పాఠశాలను కూల్చివేయాలని ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ అధికారులు మాత్రం పట్టించుకోవడంలేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి శిథిలావస్థకు చేరుకున్న పాఠశాలను కూల్చివేయాలని తల్లిదండ్రులు కొరుతున్నారు.