E.G: తాళ్లపూడి మండలం ప్రక్కిలంకలో ఆంజనేయ స్వామివారి దేవాలయంలో పవిత్ర సుదర్శన హోమంలో ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ప్రతి శుక్రవారం ఆలయంలో గ్రామ ప్రజల ఆధ్యాత్మిక శ్రద్ధ, భక్తి ఎంతో హృదయాన్ని హత్తుకునేలా కార్యక్రమాలు జరుగుతాయన్నారు. దేవాలయ అభివృద్ధికి, గ్రామ పురోభివృద్ధికి పనిచేస్తానని ఆయన హామీ ఇచ్చారు.