KMR: మద్నూర్ మండల కేంద్రంలో శుక్రవారం బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి రౌత్వార్ ఈశ్వరమ్మ నామినేషన్ ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పాల్గొన్నారు. రథంగల్లీ నుంచి గాంధీ చౌక్ మీదుగా చేపట్టిన ర్యాలీలో హన్మంత్ షిండే పాల్గొన్నారు. పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.