భారత్, రష్యా దేశాల మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయి. ఇరు దేశాల మధ్య సహకారం, వలస విధానం, అలాగే వైద్య, ఆరోగ్య రంగాలలో ద్వైపాక్షిక ఒప్పందాలు జరిగాయి. వీటితో పాటు, రసాయనాలు, ఎరువుల సరఫరాపై, అలాగే సముద్ర ఆహార ఉత్పత్తులపై కూడా రెండు దేశాలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అంతేకాకుండా, పోర్టులు, నౌకా నిర్మాణ రంగాలలో పరస్పర సహకారానికి కూడా ఒప్పందం జరిగింది.