ATP: అరటి ధరలు అమాంతంగా పడిపోవడంతో పంట సాగుకు చేసిన రైతు నాగలింగం తీవ్రంగా నష్టపోయాడు. తీసుకోచ్చిన అప్పు తీర్చే మార్గం లేక పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామానికి చెందిన నాగలింగం ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతపురం ఆసుపత్రిలో పోస్టుమార్టం చేసి, పోలీసుల బందోబస్తు మధ్య రైతు నాగలింగం అంత్యక్రియలు జరిగాయి.