MNCL: అభివృద్ధి కోసం కాంగ్రెస్ మద్దతు దారులను గెలిపించాలని జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు సురేఖ ప్రేమ్ సాగర్ రావు కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ ఆమె దండేపల్లి మండలంలోని కన్నేపల్లి, నంబాల, వెల్గనూర్, కాసిపేట, ద్వారక, ధర్మారావుపేట గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మద్దతు దారుల తరఫున ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు.