ఛత్తీస్‌గఢ్, మిజోరం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఛత్తీస్‌గఢ్‌లో తొలి విడతలో 20 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది.
ఛత్తీస్‌గఢ్(Chhattisgarh), మిజోరంలో ఉ.7గం.కు మొదలైన పోలింగ్ కొనసాగుతోంది. ఛత్తీస్గడ్ తొలి విడతలో ఇవాళ 20 చోట్ల, మిజోరంలో మొత్తం 40 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరుగుతోంది. ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎం(EVM)లలో నిక్షిప్తం చేస్తున్నారు. ఛత్తీస్గడ్ నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలైన 10 చోట్ల పోలింగ్ ఉ.7గం. కు ప్రారంభం కాగా 3గం.కు ముగియనుంది. మిజోరంలో 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. మిజోరం సీఎం జోరంతంగా (CM Zoramthanga) ఓటు వేశారు. నక్సల్స్ ప్రభావిత బస్తర్ జిల్లాలోని పలు ప్రాంతాలు సహా మొత్తం 20 నియోజకవర్గాలకు ఓటింగ్ జరగనుంది.
ఓటింగ్(Voting)ప్రక్రియను రెండు టైమ్ స్లాట్స్‌గా విభజించారు. మొదటి స్లాట్ ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. ఇక రెండో స్లాట్‌లో ఉదయం 7 గంటలకు ఓటింగ్ మొదలై మధ్యాహ్నం 3 గంటలకు ముగియనుంది. నక్సల్స్ ప్రభావితం ప్రాంతం కావడంతో పకడ్బందీ భద్రతా చర్యలను ఎన్నికల సంఘం (EC) ఏర్పాటు చేసింది. తొలి దశ ఎన్నికల్లో బస్తర్, రాజ్‌నంద్‌గావ్ జిల్లాల నుంచి 223 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మిజోరం (Mizoram) అసెంబ్లీకి నేడు జరిగే పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు చీఫ్ ఎలక్టోరల్ అధికారి(CEO) మధూప్ వ్యాస్ చెప్పారు. అసెంబ్లీలోని 40 స్థానాలకు గాను 18 మంది మహిళలు, 27 మంది స్వతంత్రులు సహా 174 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.