BAN vs SL: మళ్లీ ఓడిన లంక..3 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ విజయం
శ్రీలంకపై బంగ్లాదేశ్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 279 పరుగులు చేసి శ్రీలంక ఆలౌట్ అయ్యింది. లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ 41.1 ఓవర్లలో 282 పరుగులు చేసి విజయాన్ని సాధించింది.
నేడు జరిగిన వన్డే ప్రపంచ కప్ టోర్నీ మ్యాచ్లో శ్రీలంకపై బంగ్లాదేశ్ విజయం సాధించింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో 3 వికెట్ల తేడాతో బంగ్లా విజయం పొందింది. 41.1 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసి బంగ్లాదేశ్ విజయం సాధించింది. మొదటగా బ్యాటింగ్ చేపట్టిన శ్రీలంక 49.3 ఓవర్లలో 279 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. లంక బ్యాటర్లలో చరిత్ అసలంక 108, పాతుమ్ నిస్సాంక 41, సదీర సమరవిక్రమ 41, ధనంజయ డిసిల్వా 34, మహేశ్ తీక్షణ 22, కుశాల్ మెండిస్ 19 పరుగులు చేశారు.