»Sit Officials Seized Rs 5 Lakh From Praveens House
Paper Leakage : ప్రవీణ్ ఇంట్లో 5 లక్షల రూపాయలు స్వాధీనం
TSPSC మరో ప్రధాన నిందితుడైన ప్రవీణ్ (Praveen) ఇంట్లో అధికారులు 5 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు సిట్ అధికారులు (SIT officials) తెలిపారు. ప్రవీణ్ ఇంట్లో సోదాలు జరపగా..శంకర లక్ష్మి డైరీ నుంచి పాస్వర్డ్ (password) చోరీ చేసినట్లు అధికారులు నిర్ధారణకు వచ్చారు. దీంతో కంప్యూటర్లో(Computer) ఉన్న ప్రశ్నాపత్రాల సమాచారాన్ని చోరీ చేసినట్లు గుర్తించారు.
TSPSC మరో ప్రధాన నిందితుడైన ప్రవీణ్ (Praveen) ఇంట్లో అధికారులు 5 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు సిట్ అధికారులు (SIT officials) తెలిపారు. ప్రవీణ్ ఇంట్లో సోదాలు జరపగా..శంకర లక్ష్మి డైరీ నుంచి పాస్వర్డ్ (password) చోరీ చేసినట్లు అధికారులు నిర్ధారణకు వచ్చారు. దీంతో కంప్యూటర్లో(Computer) ఉన్న ప్రశ్నాపత్రాల సమాచారాన్ని చోరీ చేసినట్లు గుర్తించారు. రాజశేఖర్ ద్వారా గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్రశ్నాపత్రాన్ని ప్రశాంత్ పొందారు. దాంతో గ్రూప్-1 (Group-1) పరీక్ష రాయడానికి గతేడాది న్యూజిలాండ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చినట్లు గుర్తించారు. తెలంగాణలో ప్రకంపనలు సృష్టించిన TSPSC పేపర్ లీక్ వ్యవహారంలో రోజుకో ట్విస్టు బయటకొస్తోంది. ఇప్పటికే ఈ కుంభకోణంలో డజన్ మందిని జైలుకు పంపిన సిట్ అధికారులు..మరో నలుగురు పాత్రదారుల్ని గుర్తించారు. ఏఈ ప్రశ్నపత్రాల లీకేజీలో (Paper Leakage) ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తుల నుంచి మహబూబ్నగర్జిల్లాకు చెందిన నలుగురు వ్యక్తులు పేపర్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
నవాబ్‌పేటకు చెందిన ప్రశాంత్ లీకైన ప్రశ్నాపత్రాన్ని సంపాదించి ఈనెల 5న జరిగిన ఏఈ పరీక్ష రాసినట్లుగా గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే షాద్‌నగర్‌తో (Shadnagar) చెందిన మరో ఇద్దరు కూడా ఏఈ పరీక్ష రాసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో తాజాగా తిరుపతి (Tirupati) అనే వ్యక్తిని సిట్ అధికారులు అరెస్టు చేశారు. దాంతో అరెస్టు సంఖ్య 15కి చేరింది. రేణుక భర్త డాక్యా ద్వారా తిరుపతి ఏఈ ప్రశ్నాపత్రం పొంది, దాన్ని రాజేందర్‌కి విక్రయించినట్లు సమాచారం. దాంతో రాజశేఖర్ బావ ప్రశాంత్‌కు LOC నోటీసులు జారీ చేశారు సిట్ అధికారులు. మరోవైపు పేపర్ లీక్ కేసులో సిట్ ముగ్గురు నిందితులైన షమీమ్, సురేష్, రమేష్‌ను కస్టడీకి కోరింది. మంగళవారం నాంపల్లి కోర్టు (Nampally Court) కస్టడీపై తీర్పు ఇవ్వనుంది. అటు నిందితులు కూడా బెయిల్‌కోసం కోర్టుకు అప్లై చేసుకున్నారు. ఇక ప్రవీణ్, రాజశేఖర్, డాక్యా, రాజేశ్వర్‌ను సిట్ విచారించింది. ఈ కేసులో ఇప్పటివరకూ మొత్తం 65 మందిని విచారించారు. పరీక్షరాసిన 65 మందికి లీకేజీతో సంబంధంలేదని సిట్ నిర్ధారణకు వచ్చింది.