RR: శాంతి, దయ, కరుణ, సామరస్యం రంజాన్ సందర్భంగా అందరిలో వెళ్లివిరియాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. మైనారిటీ నేతలు జమ్రుద్ ఖాన్, ఎండి ఫర్దీన్ ఆధ్వర్యంలో ఫరూఖ్ నగర్ ఈద్గా వద్ద ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూజ.. ఇఫ్తార్ విందులు సోదర భావానికి, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తాయన్నారు.