జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు కొండ గట్టు అంజన్న, ధర్మపురి లక్ష్మీనరసింహ క్షేత్రాల్లో పర్యటించనున్నారు. జనసేన పార్టీ ఎన్నిక ప్రచార రథం వారాహి వాహనానికి ఈరోజు అంజన్న సన్నిథితిలో ప్రత్యేక పూజలను నిర్వహించనున్నారు. అనంతరం ఈ వాహనం రోడ్డు ఎక్కనుంది. ఇప్పటికే హైదరాబాద్ నుంచి పవన్ కళ్యాణ్ కొండగట్టుకు పయనం అయ్యారు. ఉదయం 11 గంటలకు ఆంజనేయస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించనున్నారు. అనంతరం జనసేన ఎన్నిక ప్రచార రథం వారాహి సమరానికి సై అంటూ రంగంలోకి దిగనున్నది. అంజన్న సన్నిధిలో ప్రత్యేక పూజల తర్వాత రోడ్డెక్కనుంది. మెగా ఫ్యామిలీ ఇలవేల్పు ఆంజనేస్వామికి పూజలు చేసిన తర్వాత పవన్ కల్యాణ్ ఎన్నికల సమరాన్ని ప్రారంభిస్తారు. జనసేన పార్టీని 2009లో కొండగట్టు అంజన్న స్వామిని దర్శించుకున్న తర్వాత పవన్ ప్రారంభించారు.