• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలు

WNP: గోపాల్‌పేట్ మండల్ కేంద్రంలో మొదటి రోజు విద్యార్థులకు పరీక్ష కేంద్రానికి ఆర్థిక సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం అన్ని విధాలుగా పరీక్ష కేంద్రం చుట్టూ పోలీస్ బందోబస్తు నిర్వహించడం జరిగింది. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించినట్లు అధికారులు తెలిపారు.

March 14, 2026 / 09:49 AM IST

విద్యార్థుల కోసం హెల్ప్ డెక్స్ ఏర్పాటు

NGKL: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌‌లో పదో తరగతి విద్యార్థుల సౌకర్యార్థం కోసం డిపో మేనేజర్ యాదయ్య ఆదేశాల మేరకు ఈరోజు హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేశారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు బస్సుల వేళలు, రూట్ల గురించి సమాచారం తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రయాణికులు, విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలను ఇక్కడ తెలియజేయవచ్చన్నారు.

March 14, 2026 / 09:44 AM IST

ట్రిపుల్‌ సెంచరీ కొట్టిన.. కోడి మాంసం.!

WGL: ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వేసవి తీవ్రతతో కోళ్ల ఉత్పత్తి తగ్గిపోవడంతో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. ఉమ్మడి జిల్లాలో కేజీ స్కిన్ చికెన్ కిలో రూ. 320 నుంచి 330 మధ్య పలుకుతుండగా.. స్కిన్లెస్ చికెన్ రూ. 300 వరకు పలుకుతున్నట్లు విక్రయదారులు తెలిపారు. వేసవి వల్ల కోళ్లు చనిపోవడం, ఫాముల్లో ఉత్పత్తి తగ్గడంతో కొరత ఏర్పడిందని వ్యాపారులు వెల్లడించారు.

March 14, 2026 / 09:44 AM IST

గ్యాస్ కొరతపై కలెక్టర్ ప్రతిమా సింగ్ సమీక్ష

MDK: జిల్లాలో ఎల్‌పీజీ సిలిండర్ల కొరత లేకుండా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులతో సమీక్షించారు. అక్రమ నిల్వలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీని ఆదేశించారు. గ్యాస్ బుకింగ్‌ల మధ్య పట్టణాల్లో 25 రోజులు, గ్రామాల్లో 45 రోజుల గ్యాప్ ఉండాలని స్పష్టం చేశారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, నిరంతర సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు.

March 14, 2026 / 09:44 AM IST

ముమ్మరంగా గాలికుంటు నివారణ టీకాలు

NLG: పశువుల్లో గాలికుంటు వ్యాధి నివారణ కోసం పశువైద్య సంవర్థక శాఖ ఆద్వర్యంలో టీకాలు వేసే కార్యక్రమం కట్టంగూరు మండలంలో ముమ్మరంగా సాగుతోంది. ఈ నెల 10న ప్రారంభించిన ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు వందల సంఖ్యలో తెల్లజాతి, నల్లజాతి పశువులకు టీకాలు వేశారు. ఇవాళ దుగినవెల్లిలో పశువులకు టీకాలు వేశారు. ఈ కార్యక్రమంలో గోపాలమిత్ర చెరుకు శ్రీనివాస్ పాల్గొన్నారు.

March 14, 2026 / 09:42 AM IST

తండ్రి మరణాన్ని గుండెల్లో దాచుకుని పరీక్షకు హాజరు

BHNG: తండ్రి చనిపోయిన దుఃఖాన్ని గుండెల్లో దాచుకుని ఓ విద్యార్థి పరీక్షకు హాజరయ్యాడు. మోత్కూర్‌కు చెందిన ఉపాధ్యాయుడు కూరెళ్ళ ఎల్లయ్య శుక్రవారం రాత్రి గుండెపోటుతో మరణించాడు. పదవ తరగతి చదువుతున్న అతని కుమారుడు కూరెళ్ళ హర్షవర్ధన్, తండ్రి మరణంతో దుఃఖంలో మునిగిపోయిన కన్నీళ్ళను దిగమింగుకుని పరీక్ష రాయడం చూపరులను కలచివేసింది.

March 14, 2026 / 09:42 AM IST

రోడ్డు ప్రమాదం.. ఒకరికి తీవ్ర గాయాలు

VKB: మోమిన్‌పేట మండల పరిధిలోని కొత్తగడి సమీపంలో శనివారం ఆటో, బైక్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. మోమిన్‌పేట వెళ్తున్న ఆటో, వికారాబాద్ నుంచి వస్తున్న బైక్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బైక్ నడుపుతున్న సురేష్ కాలు విరిగి తీవ్రంగా గాయపడగా, ఆటో డ్రైవర్ స్వల్ప గాయాలయ్యాయి. గమనించిన ప్రయాణికులు 108లో గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు.

March 14, 2026 / 09:41 AM IST

కౌమార విద్యపై జిల్లా స్థాయి పోస్టర్ మేళా

JGL: ప్రభుత్వ ఆదేశాల మేరకు డీసీఈబీ (టీచర్స్ భవన్)లో జిల్లా స్థాయి కౌమార విద్య పోస్టర్ మేళా పోటీలు నిర్వహించారు. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా 83 పాఠశాలల నుంచి విద్యార్థులు గైడ్ టీచర్లతో కలిసి పాల్గొని కౌమార విద్యపై పోస్టర్లు రూపొందించారు. న్యాయనిర్ణేతలుగా జీవశాస్త్ర ఉపాధ్యాయులు తిరుపతి, పవన్ కుమార్, శ్రీనివాస్ పరిశీలించి విజేతలను ఎంపిక చేశారు.

March 14, 2026 / 09:40 AM IST

ధర్మారంలో ప్రశాంతంగా మొదలైన టెన్త్ పరీక్షలు

PDPL: ధర్మారం మండలంలో ఇవాళ 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మండలంలో మొత్తం ఐదు కేంద్రాలలో 710 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు ఎంఈఓ ప్రభాకర్ తెలిపారు. నంది మేడారం జడ్పీ హైస్కూల్‌లో ఇన్విజిలేటర్లు విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి అనుమతించారు. పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

March 14, 2026 / 09:32 AM IST

ఒత్తిడి లేకుండా పరీక్షలు ధైర్యంగా రాయాలి: MLA

WGL: ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి ప్రారంభమయ్యే పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కె. ఆర్. నాగరాజు శుభాకాంక్షలు తెలిపారు. ఏకాగ్రతతో పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించాలని” MLA విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు భయం, ఒత్తిడి లేకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలన్నారు.

March 14, 2026 / 09:31 AM IST

ఆర్గానిక్ సాగుపై దామరగిద్ద రైతులకు శిక్షణ

NRPT: దామరగిద్ద మండలానికి చెందిన పలువురు రైతులు క్షేత్ర పర్యటనలో భాగంగా సిద్దిపేట జిల్లా చేర్యాలను సందర్శించారు. అక్కడ అమలవుతున్న సేంద్రియ వ్యవసాయ పద్ధతులపై నిపుణుల ద్వారా అవగాహన పెంపొందించుకున్నారు. రసాయన ఎరువులు లేకుండా జీవామృతం తయారీ, మట్టి సారాన్ని కాపాడుకుంటూ పంటలు సాగు చేసే విధానాలపై తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.

March 14, 2026 / 09:31 AM IST

హన్వాడ హైవేపై మురుగునీరుతో ఇబ్బందులు

MBNR:హన్వాడ మండల కేంద్రంలోని 167వ జాతీయ రహదారిపై మురుగునీరు పారుతుండటంతో వాహనదారులు, బాటసారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. సరైన డ్రైనేజీ కాలువలు లేకపోవడంతో మురుగునీరు రోడ్డుపైకి చేరుతోంది. అధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు

March 14, 2026 / 09:30 AM IST

ఘనంగా శ్రీ సాంబశివ స్వామి ఆలయ ద్వితీయ వార్షికోత్సవం

JGL: ఇబ్రహీంపట్నం మండలం అమ్మక్కపేట గ్రామంలోని శ్రీ సాంబ శివ స్వామి దేవాలయంలో ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి.  హంపి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యారణ్య భారతి స్వామి వేడుకల్లో పాల్గొని శ్రీ పార్వతి సాంబశివ స్వామి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామి వారు భక్తులకు దివ్య మంగళ ప్రవచనాలు అందించారు.

March 14, 2026 / 09:24 AM IST

సాగునీటి కోసం రైతుల ఆందోళన

SDPT:  పంటలకు సాగు నీటిని అందించాలని చిన్నకోడూరు మండలం గంగాపూర్‌లో రైతులు రైల్వే లైన్ పనులను అడ్డుకోని ఆందోళన చేపట్టారు. రంగనాయకసాగర్ ఎడమ కాలువ కింద ఉన్న పిల్ల కాలువ పక్కన రైల్వే లైన్ పనులు జరుగుతున్నాయని, రైల్వే లైన్ బ్రిడ్జి నిర్మించాల్సి ఉండగా, పనులు నిలిచిపోవడంతో సాగు నీరు వెళ్లడానికి అడ్డంకిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

March 14, 2026 / 09:21 AM IST

‘500 మంది ‘సైబర్ సింబా’లకు శిక్షణ’

HYD: సైబర్ నేరగాళ్లను అడ్డుకునేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే ప్రజలకు అవగాహన కల్పిస్తున్న నేరాలు ఆగడం లేదు. దీంతో ‘సైబర్ సింబా’ పేరుతో వాలంటీర్లను సిద్ధం చేశారు. తొలిదశలో 500 మందికి శిక్షణ ఇచ్చారు. వీరు పోలీస్ స్టేషన్‌తో అనుసంధానమై ప్రజలకు అవగాహన కల్పిస్తారు. వీరికి హైదరాబాద్ సీపీ సజ్జనార్ శుభాకాంక్షలు తెలిపారు.

March 14, 2026 / 09:20 AM IST