• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ఆర్డీవోను కలిసిన తర్నికల్ గ్రామస్తులు

NGKL: కల్వకుర్తి మండలంలోని గ్రామస్తులు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు, ఎస్సీలకు తమకు అన్యాయం జరిగిందంటూ కల్వకుర్తి ఆర్డీవో గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. గ్రామంలో పూర్తిగా బీసీలు ఉన్న దగ్గర ఎస్సీ రిజర్వేషన్లు ఇచ్చారని, ఎస్సీలు ఉన్న దగ్గర బీసీలకు రిజర్వేషన్ ఇచ్చారని వాపోయారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని మార్చే ప్రయత్నం చేయాలని ఆర్డీవో కోరారు.

October 7, 2025 / 05:40 PM IST

మాగంటి సునీత గోపీనాథ్‌ని కలిసిన GHMC కార్పొరేటర్లు

HYD: జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్‌ని జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు రాజ్‌ కుమార్ పటేల్, దేదీప్య రావు, సామల హేమ మర్యాద పూర్వకంగా కలిశారు. మాగంటి గోపీనాథ్‌తో తమకున్న అనుభవాలను, జ్ఞాపకాలను వారితో పంచుకున్నారు. ప్రజలకు ఆయన అందించిన సేవలను కొనియాడుతూ.. రాబోయే ఉపఎన్నికలో ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

October 7, 2025 / 05:40 PM IST

‘మొక్కలు నాటే సాకుతో రోడ్డు ధ్వంసం’

నారాయణపేట మండలం అప్పక్‌పల్లి, కోటకొండ మధ్య రహదారిని మొక్కలు నాటే సాకుతో ధ్వంసం చేస్తున్నారని సీపీఎం ఎంఎల్ మాస్ లైన్ పార్టీ నేతలు వెంకట్‌రాములు మంగళవారం ఆరోపించారు. జేసీబీతో గుంతలు తవ్వుతుండటం వల్లే రోడ్డు పాడవుతోందని వారు తెలిపారు. ఈ విషయం అటవీ శాఖ అధికారులకు చెప్పగా, వారు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని నేతలు విమర్శించారు.

October 7, 2025 / 05:34 PM IST

‘ఎన్నికలలో ఎటువంటి పొరపాట్లకు తావు ఉండకూడదు’

MBNR: స్థానిక సంస్థల ఎన్నికలలో ఎటువంటి పొరపాట్లకు తాగు ఉండకూడదని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల కొరకు ప్రొసీడింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు. ఎన్నికలు సజావుగా చదవడంలో అధికారుల పాత్ర కీలకమన్నారు.

October 7, 2025 / 05:34 PM IST

ATC కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్

BDK: మణుగూరు ప్రభుత్వ ఐటిఐ లో ప్రారంభించిన ATC కేంద్రాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ జీతేష్ వి పాటిల్ ఆకస్మికంగా సందర్శించారు. ATC‌లో పెండింగ్ పనులను గురించి వాటి పురోగతి విషయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు నైపుణ్యాలను పెంపొదించుకోవాలన్నారు. నేటి పోటీ ప్రపంచంలో స్కిల్స్ పెంచుకోవాలన్నారు.

October 7, 2025 / 05:33 PM IST

‘వాహనాల నెంబర్ ప్లేట్లు తప్పనిసరిగా ఉండాలి’

KMM: వాహనాల నెంబర్ ప్లేట్లపై తప్పనిసరిగా వాహన నెంబర్ ఉండాలని వైరా ఎస్సై పుష్పాల రామారావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి వాహనదారుడు వాహనానికి ముందు వెనక తప్పనిసరిగా నెంబర్ ప్లేట్ పై వాహన నెంబరు ఉండేలా చూసుకోవాలన్నారు. అలా కాకుండా వెనుక నెంబర్ ప్లేట్‌పై నెంబర్ కనిపించకుండా పేర్లు రాస్తే అలాంటి వాహనాలపై కేసులు నమోదు చేస్తామన్నారు.

October 7, 2025 / 05:33 PM IST

బైపాస్ రోడ్డు విస్తరణ పనులను పరిశీలించిన జగ్గారెడ్డి

SRD: సంగారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ అతిథి గృహం నుంచి బసవేశ్వర విగ్రహం వరకు బైపాస్ రోడ్డు విస్తరణ పనులను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మంగళవారం పరిశీలించారు. రోడ్డు విస్తరణ ఆలస్యంగా జరగడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. చెట్లు విద్యుత్ స్తంభాల కారణంగా విస్తరణ పనులు ఆలస్యం అవుతుందని హెచ్ఎండీఏ అధికారులు వివరించారు.

October 7, 2025 / 05:32 PM IST

జిల్లా ఎస్పీ కార్యాలయంలో వాల్మీకి జయంతి వేడుకలు

NGKL: జిల్లా ఎస్పీ కార్యాలయంలో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రంగనాథ్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. సంస్కృతి, సాహిత్యంలో వాల్మీకి మహర్షి ఆదికవిగా నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వర్లు, సిఐ కనకయ్య తదితరులు పాల్గొన్నారు.

October 7, 2025 / 05:30 PM IST

‘బీసీ వ్యతిరేకులకు బుద్ధి చెప్పాలి’

KMR: బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వారికి తగిన బుద్ధి చెప్పాలని జిల్లా బీసీ సంఘం ప్రతినిధులు శివరాములు నాగరాజు పిలుపునిచ్చారు. మంగళవారం కామారెడ్డిలోని మహాత్మ జ్యోతిబాపూలే విగ్రహానికి బీసీ సంఘం నాయకులు పూలమాలలు వేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లను ఎవరు అడ్డుకున్నా తగిన బుద్ధి చెబుతామన్నారు.

October 7, 2025 / 05:26 PM IST

ACP పార్థివ దేహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే

WGL: జూలూరుపాడు మండలానికి చెందిన ACP సబ్బతి విష్ణుమూర్తి గారు గుండెపోటుతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న వర్ధన్నపేట MLA నాగరాజు, WGL అర్బన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు దిలీప్ రాజ్ ఇవాళ మృతుడి ఇంటికి వెళ్లి ఆయన పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

October 7, 2025 / 05:25 PM IST

BJP పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటుంది: కీర్తి రెడ్డి

BHPL: చిట్యాల మండల కేంద్రంలోని పలు గ్రామాల్లో BJP రాష్ట్ర అధికార ప్రతినిధి డా. చందుపట్ల కీర్తి రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఇటీవల పలు కారణలతో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. BJP పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. జిల్లా అధ్యక్షుడు నిషేధర్ రెడ్డి కార్యకర్తలు ఉన్నారు.

October 7, 2025 / 05:24 PM IST

రోడ్డుపై వ్యాపారం చేస్తే కఠిన చర్యలు: ట్రాఫిక్ సీఐ

SRD: రోడ్డును ఆక్రమించి వ్యాపారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ సీఐ రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. సంగారెడ్డిలోని సినిమా రోడ్డులో రోడ్డుపై వ్యాపారం చేస్తున్న వారికి నోటీసులను మంగళవారం అందించారు. రోడ్డుపైన వ్యాపారాలను వెంటనే తొలగించాలని సూచించారు. లేకుంటే తామే తొలగిస్తామని తెలిపారు.

October 7, 2025 / 05:23 PM IST

‘తొలి కావ్యమైన రామాయణాన్ని రచించిన మహర్షి’

SRPT: సంస్కృత భాషలో తొలి కావ్యమైన రామాయణాన్ని రచించిన మహర్షి వాల్మీకి ఆదికవి అని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహర్షి వాల్మీకి దొంగ నుంచి ఆదికవిగా మారాడన్నారు.

October 7, 2025 / 05:23 PM IST

డ్రంక్ డ్రైవ్‌లో ముగ్గురికి జైలు

NZB: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ముగ్గురికి రెండు రోజుల చొప్పున జైలు శిక్ష విధిస్తూ మెజిస్ట్రేట్ తీర్పు ఇచ్చినట్లు ట్రాఫిక్ సీఐ ప్రసాద్ తెలిపారు. మంగళవారం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా ముగ్గురికి రెండు రోజులు చొప్పున జైలు శిక్ష విధించారు. మరో 13 మందికి రూ.19,500 జరిమానా విధిస్తూ మెజిస్ట్రేట్ తీర్పు వెల్లడించారు.

October 7, 2025 / 05:23 PM IST

డీఎస్పీ కార్యాలయాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ

BDK: కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ మంగళవారం డిఎస్పి కార్యాలయాన్ని సందర్శించారు. అనంతరం పోలీస్ స్టేషన్‌లో పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారు మాట్లాడుతూ.. అన్ని పోలీస్ స్టేషన్‌లో పరిధిలో ఎటువంటి నేరాలు జరగకుండా నిఘా నేత్రాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

October 7, 2025 / 05:21 PM IST