• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

గ్రామపంచాయతీ కార్యాలయంలో ఉచిత వైద్య శిబిరం

BDK: చుంచుపల్లి మండలం విద్యానగర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో బుధవారం ఉచిత ఆరోగ్యం వైద్య శిబిరం నిర్వహించారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో మండల కార్యదర్శి వాసిరెడ్డి మురళి హాజరై వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అలాగే వైద్య పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు పంపిణీ చేశారు. ఈ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

October 8, 2025 / 12:53 PM IST

‘విద్యారంగంపై నిర్లక్ష్యం తగదు’

KMM: రాష్ట్ర ప్రభుత్వం బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ విద్యార్థులకు బిల్లులు చెల్లించకుండా విద్యను దూరం చేస్తూ వివక్షత చూపుతుందని AISF జాతీయ సభ్యుడు ఇటికాల రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. ఖమ్మం గిరిప్రసాద్ భవన్ లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత మూడేళ్లుగా ప్రభుత్వం విద్యార్థులకు అందించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించడంలేదన్నారు.

October 8, 2025 / 12:51 PM IST

బృందావన పురం గ్రామ మాజీ సర్పంచ్ మృతి

SRPT: నడిగూడెం మండలం బృందావనపురం గ్రామ మాజీ సర్పంచ్ అంతయ్య గౌడ్ బుధవారం అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన గ్రామ అభివృద్ధికి విశేష కృషి చేశారని స్థానికులు వాపోయారు. ఆయన మృతి పట్ల సీపీఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్, టీడీపీ నాయకులు సంతాపం వ్యక్తం చేస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

October 8, 2025 / 12:50 PM IST

‘తల్లి పులి, పిల్ల పులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’

ASF: బెజ్జూర్ మండలం అటవీ ప్రాంతాల్లో మహారాష్ట్ర నుంచి వచ్చిన తల్లి పులి, పిల్ల పులి సంచారం కలకలం రేపుతోంది. గ్రామాల వైపు వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు సూచించారు. బుధవారం ఫారెస్ట్ అధికారి జగన్ విడుదల చేసిన ప్రకటనలో రాత్రివేళ బయటకు వెళ్లవద్దని, పశువులను భద్రంగా ఉంచాలని, అడవిలో ఒంటరిగా వెళ్లకూడదని సూచించారు.

October 8, 2025 / 12:46 PM IST

‘భాగ్యరాజ్ హఠాన్మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు’

SRPT: కోదాడ పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ భాగ్యరాజ్ బుధవారం తెల్లవారుజామున గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. భాగ్యరాజ్ మృతదేహాన్ని టీపీపీసీ డెలిగేట్ లక్ష్మీనారాయణ రెడ్డి సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించారు.

October 8, 2025 / 12:43 PM IST

బాకీ కార్డుల పంపిణీకి ప్రజల అనూహ్య స్పందన: మాజీమంత్రి

WNP: జిల్లాలోని 20వ వార్డులో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి బాకీ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. బాకీ కార్డులు అందుకున్న మహిళలు, నిరుద్యోగులు అనూహ్యంగా స్పందిస్తూ స్వయంగా కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలు వివరిస్తూ వారికి బుద్ధి చెప్తామని కేసీఆర్‌కి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేసిందన్నారు.

October 8, 2025 / 12:35 PM IST

శ్రీ కోట దుర్గమ్మ ప్రత్యేక అలంకరణ

KMR: శ్రీ కోట దుర్గమ్మ ఆలయంలో మంగళవారం అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. బుదవారం అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. నిత్య కల్యాణ మండపంలో జరిగిన అమ్మవారి అలంకరణ అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా భక్తులు “జై భవాని” నినాదాలతో అమ్మవారికి పూజలు నిర్వహించి, ఆశీస్సులు పొందారు.

October 8, 2025 / 12:33 PM IST

కాంగ్రెస్ పతనానికి ‘బాకీ కార్డు’ బ్రహ్మాస్త్రం

SRPT: అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు సూర్యాపేట పట్టణంలో ‘బాకీ కార్డు’ ఇవాళ చిరు వ్యాపారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి ఎంత బాకీ ఉందో ఈ కార్డు తెలియజేస్తుందన్నారు.

October 8, 2025 / 12:25 PM IST

ఆలయ నిర్మాణం పై సమావేశం ఏర్పాటు

MBNR: మిడ్జిల్ మండలం దోనూర్ గ్రామంలో పురాతన శివాలయం పునర్నిర్మాణంపై గ్రామ పెద్దలు బుధవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో గ్రామంలోని అన్ని కులాలకు సంబంధించిన వారి అభిప్రాయాలను స్వీకరించారు. ఆలయానికి కావలసిన స్థల సేకరణ, పునర్నిర్మాణానికి అయ్యే ఖర్చు, విరాళాలు తదితర విషయాల గురించి చర్చించారు.

October 8, 2025 / 12:25 PM IST

శ్రీ సద్గురు నారాయణ బాబా ఆశ్రమాన్ని దర్శించుకున్న MLA

ADB: తలమడుగు మండలంలోని పల్సీతాండా గ్రామంలో ఉన్న శ్రీ సద్గురు నారాయణ బాబా ఆశ్రమాన్ని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ దర్శించుకున్నారు. స్థానిక నాయకులు, గ్రామస్తులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామస్తులందరూ సమిష్టిగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టడం గొప్ప విషయమని పేర్కొన్నారు. ప్రజలు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి ఆధ్యాత్మికం అలవర్చుకోవాలని అన్నారు.

October 8, 2025 / 12:24 PM IST

టెలిగ్రామ్ యాప్ క్లిక్ తో రూ.1.25 లక్షలు మాయం

BDK: పాల్వంచ మండలంలోని జగన్నాథపురం గ్రామానికి చెందిన మాలోత్ పవన్ తన సెల్‌ఫోన్‌లో వచ్చిన టెలిగ్రామ్ యాప్‌ను పలుమార్లు క్లిక్ చేయడంతో రూ.40 వేలు, మరోసారి రూ.20 వేలు చొప్పున మొత్తం రూ.1.25 లక్షలు తన ఖాతాలోంచి పోగొట్టుకున్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేయగా, సైబర్ క్రైమ్ కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై సురేశ్ నేడు తెలిపారు.

October 8, 2025 / 12:24 PM IST

బాత్రూంలో వీడియో రికార్డు.. ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై కేసు నమోదు

HYD: యూసఫ్‌గూడ, యాదగిరినగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్లో స్నానం చేస్తున్న యువకుడి(30) నగ్నవీడియోను రికార్డు చేసిన ట్రాఫిక్ కానిస్టేబుల్ పై కేసు నమోదైంది. పంజాగుట్ట ట్రాఫిక్ పీఎస్‌లో పనిచేస్తున్న నరేందర్ అనే కానిస్టేబుల్ అదే అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నాడు. స్నానం చేస్తున్న యువకుడి వీడియోను వెంటిలేటర్లోంచి తీస్తుండగా.. గమనించిన యువకుడు కేకలు వేశాడు.

October 8, 2025 / 12:19 PM IST

మాజీ వార్డు సభ్యుడు మృతి… మాజీ ఎమ్మెల్యే నివాళి

NLG: నార్కెట్‌పల్లి మండలం చెరువుగట్టు గ్రామ మాజీ వార్డు సభ్యుడు దోడి నరసింహ మృతిచెందగా… వారి మృతదేహాన్ని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా పూలమాలవేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఆయన వెంట గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

October 8, 2025 / 12:18 PM IST

తెలంగాణ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్‌కి ఎంపికైన యువకుడు

జగిత్యాల జిల్లా అల్లిపూర్ గ్రామానికి చెందిన కునమల్ల సుమన్ డైరెక్టర్, నటుడు, నిర్మాతగా మూడు నిమిషాల నిడివిలో తెలంగాణ సాంస్కృతి, సాంప్రదాయాలు మరియు ప్రభుత్వ పథకాలను ప్రతిబింబించేలా ఓ లఘు చిత్రం రూపొందించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన “యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్” కార్యక్రమంలో ఈ షార్ట్ ఫిలిం ఎంపికవడంతో పలువురు కళాభిమానులు సుమన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

October 8, 2025 / 12:12 PM IST

బహుజన డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా కన్వీనర్ నియమకం

NZB: బహుజన డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ బీడీఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్‌గా తలారె సంజయ్‌ను నియమించినట్లు బుధవారం బీడీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వడ్ల సాయి కృష్ణ ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. జిల్లా బోధన్ పట్టణానికి చెందిన టీ.సంజయ్ వామపక్ష విద్యార్థి ఉద్యమాల ద్వారా విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.

October 8, 2025 / 12:11 PM IST