జగిత్యాల జిల్లా అల్లిపూర్ గ్రామానికి చెందిన కునమల్ల సుమన్ డైరెక్టర్, నటుడు, నిర్మాతగా మూడు నిమిషాల నిడివిలో తెలంగాణ సాంస్కృతి, సాంప్రదాయాలు మరియు ప్రభుత్వ పథకాలను ప్రతిబింబించేలా ఓ లఘు చిత్రం రూపొందించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన “యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్” కార్యక్రమంలో ఈ షార్ట్ ఫిలిం ఎంపికవడంతో పలువురు కళాభిమానులు సుమన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.