‘ఆపరేషన్ సింధూర్’లో భారత వైమానిక యోధులు చరిత్ర సృష్టించారని వాయుసేన అధిపతి ఏపీ సింగ్ పేర్కొన్నారు. దేశ గౌరవానికి సంరక్షకులమని, వైమానిక దళ సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. అవసరమైతే మరింత శిక్షణ తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఘర్షణ నేపథ్యంలో అక్కడి భారతీయ పౌరులను తిరిగి తీసుకురావడంలో వైమానిక దళం పాత్రను అభినందించారు.