AP: కోనసీమ జిల్లాలో ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు, సహాయక చర్యలపై ఆరా తీశారు. అధికారులు ఘటనా స్థలికి వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. కాగా, బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు దాటికి ఆరుగురు సజీవ దహనమయ్యారు.