AP: కోనసీమ జిల్లాలో అగ్నిప్రమాదంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటన బాధాకరమని అన్నారు. అలాగే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు. అయితే, పేలుడు ఘటనలో ఏడుగురు మృతిచెందిన విషయం తెలిసిందే.